: ‘బంగ్లా’లో హిందూ దేవాలయంపై బాంబుల దాడి


మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్ లోని పురాతన హిందూ దేవాలయంపై గుర్తుతెలియని దుండుగులు బాంబులతో దాడి చేశారు. ఈ సంఘటనలో పదిమంది గాయపడ్డారు. ఆలయం పాక్షికంగా దెబ్బతింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు బంగ్లాదేశ్ దినాజ్పూర్ లో రష్ మేళా సందర్భంగా జరుగుతున్న వేడుకను చూసేందుకు చాలా మంది భక్తులు పురాతన కంతాజీ ఆలయానికి వెళ్లారు. రష్ మేళా జరుగుతుండగా, గుర్తుతెలియని నిందితులు ఈ ఆలయంపై బాంబులతో దాడి చేశారు. ఈ సంఘటనలో సుమారు 10 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను దినాజ్ పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ, పథకం ప్రకారం భూమిలో అమర్చిన మూడు బాంబులను నిందితులు పేల్చివేశారన్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News