: కొడుకు కారు కింద పడి తండ్రి దుర్మరణం!
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్న కొడుకు తన వాహనాన్ని రివర్స్ చేస్తుండగా తన తండ్రికి ఢీకొట్టడంతో ఆయన దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రంలోని డెంకణీ కోట సమీపంలో ఉన్న హనుమంతపురంలో జరిగింది. గోవిందన్ తండ్రి సుగ్గప్ప. కొత్త టాటా సుమోను గోవిందన్ ఇటీవలే కొనుగోలు చేశాడు. అయితే, అతనికి డ్రైవింగ్ చేయడం రాకపోవడంతో వారం రోజులుగా శిక్షణ తీసుకుంటున్నాడు. గురువారం రాత్రి ఇంటి వద్ద ఉన్న సుమోను అతను రివర్స్ చేస్తున్నాడు. అయితే, సుమో వెనుక తన తండ్రి సుగ్గప్ప ఉండటాన్ని గోవిందన్ గమనించలేదు. దీంతో, సుగ్గప్ప అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనతో గోవిందన్ కుటుంబంలో విషాదం అలముకుంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.