: జీఎంఆర్ లో రూ.2వేల కోట్ల కువైట్ పెట్టుబడి
భారత్ కు చెందిన జీఎంఆర్ ఇన్ ఫ్రా కంపెనీలో కువైట్ పెట్టుబడి పెడుతోంది. ఆ కంపెనీ జారీ చేయనున్న ఫారిన్ కరెన్సీ కన్వెర్టిబుల్ బాండ్స్ లో 60 ఏళ్లకు (2075 వరకూ) కువైట్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ రూ.2వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కువైట్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ మన దేశంలో పెడుతున్న అతిపెద్ద ద్వైపాక్షిక పెట్టుబడి ఇదేనని జీఎంఆర్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు తెలిపారు. భారత ప్రభుత్వం ప్రత్యేకించి ఇన్ ఫ్రా రంగంలో చేపడుతున్న దీర్ఘకాలిక చర్యల పట్ల విదేశీయుల విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.