: నాలుగు పరుగుల తేడాతో మరో రెండు వికెట్లు కోల్పోయిన భారత్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్ (21) మోర్కెల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పుజారా (28) ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ కేవలం నాలుగు పరుగుల తేడాతో ఔటయ్యారు. క్రీజులో కోహ్లి (10), రహానే (0)లు ఉన్నారు. టీమిండియా ప్రస్తుత స్కోరు 4 వికెట్ల నష్టానికి 65 పరుగులు. దీంతో, భారత్ ఆధిక్యం 278 పరుగులకు చేరింది.