: ఏపీకి నూతన జాతీయ రహదారిని ఆమోదిస్తున్నట్టు నితిన్ గడ్కరీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కు 1350 కిలో మీటర్ల నూతన జాతీయ రహదారిని ఆమోదిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. విజయవాడలో జరిగిన దుర్గగుడి ఫ్లైఓవర్, రహదారి విస్తరణ పనుల శంకుస్థాపన తరువాత ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఏపీకి మరిన్ని జాతీయ రహదారులు చేపట్టాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారన్నారు. డిసెంబర్ 2016 నాటికి రాష్ట్రం కోరిన అన్ని జాతీయ రహదారులను ప్రారంభిస్తామని చెప్పారు. ఇక విజయవాడకు 180 కిలో మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు చేపట్టాలని చంద్రబాబు సంకల్పం అని, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.20వేల కోట్లు ప్రకటిస్తున్నామని గడ్కరీ తెలిపారు. అభివృద్ధికి ముందుచూపు చాలా అవసరమన్న మంత్రి, రాష్ట్ర అభివృద్ధిపై బాబుకు ముందు చూపు ఉందని ప్రశంసించారు. కేంద్ర సహకారంలో ఆయన విజయవంతమవుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.