: హార్దిక్ పటేల్ కు దీదీ సపోర్ట్!... ‘పాస్’ నేతతో భేటీకి గ్రీన్ సిగ్నల్


భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన కార్ల తయారీ యూనిట్ ను పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ కు తరలించిన వైనం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నట్టుంది. అందుకేనేమో రాజకీయ వైరంతో ప్రధాని నరేంద్ర మోదీతో ఢీకొడుతున్న దీదీ, గుజరాత్ పైనా అవకాశం చిక్కినప్పుడల్లా ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. తాజాగా గుజరాత్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత, యువ సంచలనం హార్దిక్ పటేల్ కు మద్దతు తెలిపేంందుకు దీదీ దాదాపుగా సంసిద్ధత తెలిపారు. ఈ మేరకు పాస్ నేత, హార్దిక్ పటేల్ ముఖ్య అనుచరుడు అఖిలేశ్ కతియార్ తో భేటీకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలోనే కోల్ కతాలో ఈ భేటీ జరగనున్నట్లు నేషనల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News