: కేటీఆర్ ను సీఎం చేయడానికి రంగం సిద్ధమవుతోంది: రఘునందన్ రావు


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు సీఎం పదవి కట్టబెట్టబోతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే రంగం సిద్ధమవుతోందని చెప్పారు. యువరాజుకు పట్టాభిషేకం చేసే క్రమంలోనే, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించి పార్టీని బలోపేతం చేస్తున్నారని అన్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న పోటీని తట్టుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన కుమారుడు సీఎం కావడమే కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లక్ష్యమని తెలిపారు. మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న కేటీఆర్ కు ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉండటం కూడా కలిసొచ్చే అంశమని రఘునందన్ రావు కితాబివ్వడం గమనార్హం. ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, రఘునందన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News