: విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్, రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన
విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్, రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేయగా, బెంజి సర్కిల్ వద్ద నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.1400 కోట్ల వ్యయంతో ఇక్కడ వంతెన, విజయవాడ-మచిలీపట్నం రహదారి విస్తరణ చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, ఎంపీ కేశినేని నాని, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితరులు హాజరయ్యారు.