: దక్షిణ హిందూ మహాసముద్రంలో 7.1 తీవ్రతతో భూకంపం
దక్షిణ హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మెక్ డోనాల్డ్, హెయిర్డ్ ఐలాండ్స్ కి ఈశాన్యంగా ఈ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1గా నమోదైందని తెలిపింది. భూకంపం ధాటికి చాలా తక్కువ నష్టం సంభవించినట్టు యూఎస్ సంస్థ పేర్కొంది. హిందూ మహాసముద్రంలోని దక్షిణ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని చెప్పింది. ఆస్ట్రేలియా నగరమైన పెర్త్ కు పశ్చిమదిశగా మూడువేల కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ సర్వే సంస్థ పేర్కొంది.