: చెన్నై ఎయిర్ పోర్టులో టేకాఫ్ తీసుకున్న విమానం... పాక్షికంగా సర్వీసుల పునరుద్ధరణ


చెన్నై ఎయిర్ పోర్టు నుంచి కొద్దిసేపటి క్రితం ఓ విమానం టేకాఫ్ తీసుకుంది. భారీ వర్షం కారణంగా చెన్నైని ముంచెత్తిన వరద ప్రవాహం చెన్నై విమానాశ్రయాన్ని కూడా ముంచేసింది. ఏకంగా రన్ వే పైకి వరద నీరు చేరడంతో ఎయిర్ పోర్టుకు మూత వేయక తప్పలేదు. దీంతో మూడు రోజులుగా చెన్నై ఎయిర్ పోర్టు నుంచి ఒక్క విమానం కూడా నింగికెగరలేదు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడం, ఎయిర్ పోర్టు నుంచి వరద నీరు నిష్క్రమించిన నేపథ్యంలో నేటి నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు నిన్ననే ప్రకటించారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం ఓ విమానం ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేదాకా పరిమిత సంఖ్యలో ఎయిర్ పోర్టు నుంచి విమానాలను నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News