: చెన్నైలో మళ్లీ వర్షం... వణికిపోతున్న నగర జనం
భారీ వర్షం కారణంగా జల సంద్రంగా మారిన తమిళనాడు రాజధాని చెన్నై ఇంకా తేరుకోలేదు. ఇప్పటికీ నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కాలనీల్లోని నీటిని తోడిపోసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వరద ప్రభావం తగ్గిపోవడంతో పలు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా నేటి ఉదయం మళ్లీ నగరంలో వర్షం ప్రారంభమైంది. దీంతో నగర జనం చిగురుటాకులా వణికిపోతున్నారు. బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.