: చంద్రబాబు నివాసంలో టీడీపీ, బీజేపీ సమన్వయ భేటీ... హాజరైన ఇరు పార్టీల కీలక నేతలు


ఏపీలో మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పలు సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి పరిస్థితి మున్ముందు తమకు నష్టాన్నే మిగిలించనుందని రెండు పార్టీల కీలక నేతలు భావించారు. సమన్వయంతో ముందుకు సాగాలని భావించారు. ఈ క్రమంలో సమన్వయ భేటీని ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఇరు పార్టీల నేతలు కోరారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం విజయవాడలోని చంద్రబాబు నివాసంలో ఇరు పార్టీల నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు సమక్షంలోనే జరుగుతున్న ఈ భేటీకి టీడీపీ తరఫున ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు... బీజేపీ నుంచి విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, పార్టీ ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News