: వాటర్ గ్రిడ్ పేరు మారింది... ఇకపై ‘మిషన్ భగీరథ’గా పిలవాలని టీ సర్కారు నిర్ణయం


కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు కీలక పథకాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాల్లో వాటర్ గ్రిడ్ ఒకటి. ప్రతి ఇంటికీ 'సురక్షిత మంచి నీరు' పేరిట ప్రారంభమైన ఈ పథకం టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన అన్ని పథకాల్లోకెల్లా అత్యంత ప్రాధాన్యం దక్కించుకున్నది. ఈ పథకాన్ని రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్లలో పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ పథకం పేరును ‘మిషన్ భగీరథ’గా మారుస్తూ నిన్న కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వాటర్ గ్రిడ్ పథకాన్ని ‘మిషన్ భగీరథ’గా పిలవాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News