: 1029 రూపాయలు బకాయిపడ్డ అబ్దుల్ కలాం... ఆస్తుల జప్తుకు బీఎస్ఎన్ఎల్ ఆదేశాలు


మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గతించి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. ఆయన ఔన్నత్యాన్ని ప్రపంచమంతా గుర్తించినా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు మాత్రం గుర్తు లేనట్టుంది. తనకు బకాయిపడ్డ స్వల్ప మొత్తాన్ని చెల్లించాలని దివంగత రాష్ట్రపతి కలాంకు బీఎస్ఎన్ఎల్ నోటీసు జారీ చేసింది. అంతేకాక బకాయి చెల్లించని పక్షంలో కలాంకు చెందిన చరాస్తులను జప్తు చేయాలని కూడా తన క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ, ఆ సంస్థకు కలాం బకాయిపడ్డ మొత్తమెంతో తెలుసా?... కేవలం రూ.1029 మాత్రమే. అది కూడా తిరువనంతపురం పర్యటనలో భాగంగా ఆయన కేరళ రాజ్ భవన్ లో రెండు రోజుల పాటు బస చేసిన సందర్భానికి సంబంధించిన బిల్లట. ఇక ఏ తేదీతో నోటీసు జారీ అయ్యిందో తెలుసా?... 18, నవంబరు, 2015 తేదీతో..అంటే కలాం చనిపోయిన నాలుగు నెలలకన్నమాట. బీఎస్ఎన్ఎల్ జారీ చేసిన నోటీసుల విషయం తెలుసుకున్న కేరళ రాజ్ భవన్ వర్గాలు షాక్ కు గురయ్యాయి. దీనిపై మరింత చర్చ జరగకముందే, సదరు బిల్లును తాను చెల్లిస్తానంటూ కేరళ రాజ్ భవన్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News