: ఎమర్జెన్సీ పొరపాటే... సిక్కుల ఊచకోత తప్పిదమే!: కాంగ్రెస్ కు షాకిచ్చిన సింధియా


గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఆ పార్టీ యువనేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా నిన్న షాకిచ్చారు. పార్టీ దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తన హయాంలో తీసుకున్న ఎమర్జెన్సీ నిర్ణయం సరైనది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక 1984లో చోటుచేసుకున్న సిక్కుల ఊచకోత ఘోర తప్పిదమని కూడా ఆయన పేర్కొన్నారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్-2015కు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోతల సందర్భంగా జరిగినవన్నీ తప్పులే. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, మనిషి ప్రాణం పోవడానికి కారణమైన నిర్ణయాలు తప్పే. అధికారంలో మా పార్టీ ఉన్నా, ఇలాంటి ఘటనలు తప్పే. ఎమర్జెన్సీపై నాడు తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ తప్పు. వ్యక్తిగత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణను హరించే ఏ చర్య అయినా తప్పే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారు హయాంలో జరిగిన నరేంద్ర దబోల్కర్ హత్య ప్రభుత్వ వైఫల్యమేనని ఎన్సీపీ నేత, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే వ్యాఖ్యానించిన మరునాడే సింధియా కూడా తన సొంత పార్టీ నిర్ణయంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News