: ఓయూలో బీఫ్ ఫెస్టివల్ కు అనుమతి లేదు: పోలీసులు


హైదరాబాదు, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు చేపట్టిన బీఫ్ ఫెస్టివల్ కు అనుమతి ఇవ్వకూడదని పోలీసులు నిర్ణయించారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించిన ఘటనలు ఉన్నాయి. అయితే బీఫ్ ఫెస్టివల్ పై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, గోమాంసంపై వివాదం రేగడంతో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణ వివాదాస్పదమైంది. దీంతో దీనికి అనుమతి నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతలు కాపాడే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీసీపీ రవీందర్ తెలిపారు. ఓయూలో శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. తమకు విద్యార్థి సంఘాల నేతలు సహకరించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News