: కడలూరు, చెన్నైలను ఆదుకొమ్మంటున్న ధనుష్, రాజమౌళి
సినీ నటులు ఒక్కొక్కరుగా తమిళనాడు వరద బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. నిండా మునిగిపోయిన చెన్నైకి అంతా అండగా నిలుస్తుండడంతో వరదల ధాటికి నష్టపోయిన కడలూరును ఆదుకునేందుకు ముందుకు రావాలని ప్రముఖ తమిళ నటుడు ధనుష్ ట్విట్టర్ ద్వారా కోరాడు. ఇప్పటికే అభిమాన సంఘాల ద్వారా కడలూరులో సహాయక చర్యలు చేపట్టిన ధనుష్ ఎంత వీలైతే అంత సాయం చేయాలని సూచించాడు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి చెన్నైకి అండగా నిలవాలని కోరాడు. హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో రానా సహాయక సెంటర్ ను ఏర్పాటు చేశాడని, ఆదుకోవాలని భావించేవారు అక్కడికి ఏదన్నా సహాయం చేయాలని సూచించాడు. ఈ సందర్భంగా రానాను రాజమౌళి అభినందించాడు.