: చెన్నై వరద బాధితులకు హెచ్.డి.ఎఫ్.సి మినహాయింపు


చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాలు ఆసక్తి చూపుతున్నాయి. చెన్నై వాసుల కష్టాలు అర్థం చేసుకున్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నెలవారీ ఇన్ స్టాల్ మెంట్ చెల్లించలేకపోయిన వినియోగదారులకు మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. గత నెల కట్టాల్సిన ఇన్ స్టాల్ మెంట్ కట్టకపోయినా పెనాల్టీ వేయమని స్పష్టం చేసింది. అలాగే నీటమునిగి నష్టపోయిన ఇళ్లకు క్విక్ హోం ఇంప్రూవ్ మెంట్ స్కీం ప్రవేశపెట్టి, రుణాలు మంజూరు చేయనున్నట్టు హెచ్ డీఎఫ్ సీ తెలిపింది. ఈ లోన్లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదని హెచ్ డీఎఫ్ సీ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సూద్ కరంద్ తెలిపారు. అయితే ఈ నిబంధన 31 డిసెంబర్ 2015 వరకు చేసుకున్న దరఖాస్తు దారులకు మాత్రమే వర్తిస్తుందని హెచ్ డీఎఫ్ సీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News