: సల్మాన్ పుట్టిన రోజున విడుదల కానున్న 'బీయింగ్ సల్మాన్'


ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జీవిత చరిత్ర బీయింగ్ సల్మాన్ పుస్తకాన్ని ఆయన పుట్టిన రోజైన డిసెంబర్ 27న విడుదల చేయనున్నట్టు ఆ పుస్తక రచయిత జైసిమ్ ఖాన్ తెలిపారు. 1988లో బాలీవుడ్ లో నటుడిగా అడుగు పెట్టిన సల్మాన్ ఖాన్, మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్, సాజన్, తేరేనామ్, దబాంగ్, ఏక్ థా టైగర్, బాడీగార్డ్, కిక్, భజరంగీ భాయ్ జాన్, ప్రేమ్ రతన్ థన్ పాయో వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. అలాగే బీయింగ్ హ్యూమన్ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ పుస్తకంలో సల్మాన్ ఖాన్ కు సంబంధించిన వ్యక్తిగత, వృత్తి గత వివరాలు, సల్మాన్ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించిన వివరాలు సహా అన్ని విషయాలు ఇందులో పొందుపరిచామని రచయిత తెలిపారు.

  • Loading...

More Telugu News