: ఆర్ బీఐ నుంచి మరికొంత రుణం తీసుకోబోతున్న ఏపీ


రాష్ట్రావసరాలను తీర్చుకొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 'ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్' నిబంధనల మేరకు ప్రభుత్వం రుణం తీసుకోవాలనుకుంటోంది. రూ.4వేల కోట్ల వరకూ రుణం తీసుకునేందుకు అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి రూ.2వేల కోట్లను రుణంగా తీసుకోవచ్చని కేంద్రం చెప్పింది. దాంతో బాండ్లను సమర్పించి ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గతంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్రం రూ.9వేల కోట్ల వరకూ రుణంగా తీసుకుంది.

  • Loading...

More Telugu News