: ట్రక్కు డ్రైవర్ పై బీఫ్ వ్యతిరేకుల దాడి!
బీఫ్ లోడ్ ను తీసుకువెళ్తున్నాడనే అనుమానంతో ట్రక్కు డ్రైవర్ పై దాడి జరిగిన సంఘటన హర్యానా లోని పాల్వల్-అలీగఢ్ జాతీయ రహదారిపై జరిగింది. గో సంరక్షణ సమితికి చెందినా సభ్యులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులతో వారు గొడవపడ్డారు. ఈ సంఘటనలో ఆరుగురు గ్రామస్థులు, నలుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానాలోని మెవత్ నుంచి వస్తున్న ఈ ట్రక్కును పాల్వల్-అలీగఢ్ రహదారిపై స్థానిక గ్రామస్థులు అడ్డుకున్నారు. దీనిని నిరసించిన డ్రైవర్ పై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. వాహనాన్ని ధ్వంసం చేశారు. జాతీయ రహదారిపై వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హర్యానా పౌర సంబంధాల డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ, ఈ గొడవ గో సంరక్షణ సమితి సభ్యులకు, పోలీసులకు మధ్య నిన్న జరిగిందన్నారు. మత ఘర్షణలు కాదని ఆయన పేర్కొన్నారు.