: తమిళనాడుకు ఒడిశా రూ. 5 కోట్ల సాయం

భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తమిళనాడును ఆదుకోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. తాజాగా తమిళనాడుకు రూ. 5 కోట్ల సహాయాన్ని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఈ మొత్తాన్ని పంపుతామని ఒడిశా మంత్రి విక్రం అరుఖ్ ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించారు. తమిళనాడు సీఎం జయలలితతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిన్న మాట్లాడారని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు, సహాయక చర్యల నిమిత్తం ఈ సాయం చేస్తున్నట్టు మంత్రి చెప్పారు.