: ఫాలో ఆన్ ప్రమాదంలో దక్షిణాఫ్రికా!


ఇంతకుముందు జరిగిన మ్యాచ్ లలో మాదిరిగా స్పిన్ కు అంతగా సహకరించని ఢిల్లీ పిచ్ పై భారత బ్యాట్స్ మన్లు సులువుగా పరుగులు సాధించిన వేళ, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మాత్రం చతికిలపడ్డారు. ఇండియా చేసిన 334 పరుగుల తొలి ఇన్నింగ్స్ తరువాత, బ్యాటింగ్ మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా ఫాలో ఆన్ ఆడాల్సిన ప్రమాదంలో పడకుండా ఉండాలంటే, ఇంకా 51 పరుగులు చేయాల్సి వుంది. జట్టులో ఒక్క డెవిలియర్స్ మినహా మరెవరూ చెప్పుకోతగ్గ స్కోరును సాధించలేకపోయారు. ప్లెసిస్ 0, డుమినీ 1, ఆమ్లా 3, అబాట్ 4, విలాస్ 11, ఎల్గర్ 17, బవుమా 22 పరుగులు చేసి పెవీలియన్ దారి పట్టారు. డెవిలియర్స్ మాత్రం భారత బౌలర్లకు కొరుకుడు పడక 25 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 7 వికెట్ల నష్టానికి 84 పరుగులు కాగా, ఫాలో ఆన్ లోకి దక్షిణాఫ్రికా వెళ్లకుండా చూడాల్సిన బాధ్యతంతా డెవిలియర్స్ పై పడింది. భారత బౌలర్లలో జడేజా 3, ఉమేష్ యాదవ్ 2, ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News