: అవన్నీ పుకార్లు...అలాంటి వార్త ఏదైనా ఉంటే నేనే చెబుతా: సన్నీ లియోన్
రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మ లతో కరణ్ జోహర్ రూపొందిస్తున్న 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలో ప్రత్యేక పాత్రలో సన్నీలియోన్ నటిస్తోందంటూ బాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అలాగే సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ నిర్మిస్తున్న సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ సరసన నటించేందుకు ఒప్పందం జరిగినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. వీటిపై సన్నీలియోన్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా వెలువడుతున్న ఈ వార్తలన్నీ పుకార్లని తెలిపింది. ఆసక్తిగా ఉండే వార్తల కోసం ఇలాంటి పుకార్లు సృష్టిస్తారని ఆమె చెప్పింది. తాను ఏదైనా సినిమాను అంగీకరిస్తే తన అధికారిక ట్విట్టర్ పేజ్ ద్వారా వెల్లడిస్తానని సన్నీ స్పష్టం చేసింది.