: మంద కృష్ణకు ‘మాదిగ’లపై శ్రద్ధలేదు!: ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి
మాదిగ కులస్థుల హక్కులపై మంద కృష్ణ మాదిగకు శ్రద్ధ లేదని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్, టీఆర్‌ఎస్ నేత పిడమర్తి రవి ఆరోపించారు. తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలని సవాలు విసిరారు. వంద రోజుల్లోనే వర్గీకరణ పూర్తి చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీని నిలదీయాలని అన్నారు. వర్గీకరణపై టీఆర్‌ఎస్ బృందం కేంద్ర మంత్రిని కలిసినా కలవలేదని మంద కృష్ణ బుకాయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరిపై మంద కృష్ణ అక్కసు వెళ్లగక్కుతున్నాడని రవి మండిపడ్డారు.