: రెండు క్రెడిట్ కార్డులున్నాయి...అకౌంట్ లో 65 వేలున్నాయి...తినడానికి తిండే లేదు... చెన్నయ్ వాసి ఆవేదన!


చెన్నైలో వరద బాధితుల కష్టాలను ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కళ్లకు కట్టేలా వివరించాడు. తానో సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నానని, ఏడాదికి 18 లక్షల వార్షిక వేతనం అందుకుంటూ, త్రిబుల్ బెడ్ రూం ఇంటిలో నివాసం ఉంటున్నందుకు ఎంతో గర్వించే వాడినని చెప్పారు. తన దగ్గర లక్ష రూపాయలకు పైగా క్రెడిట్ లిమిట్ కలిగిన రెండు క్రెడిట్ కార్డులు, తన బ్యాంకు ఖాతాలో 65 వేల రూపాయలు ఉన్నాయని వెల్లడించారు. అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సైనికులు జారవిడిచే ఆహార పదార్థాల కోసం ఎదురు చూస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుక్కెడు నీరు, పిడికెడు మెతుకులు లేక చెన్నై వాసులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. తనలాంటి వేలాది మంది ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన వివరించారు. ఒక స్థాయి ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంత ఇబ్బంది పడితే, మధ్యతరగతి ప్రజల సంగతి వర్ణనాతీతమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News