: ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి బీఎస్పీ నేతను కాల్చేశారు
ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ నేత రామ్ బిహారీ చౌబేను ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. శ్రీకాంత్ పూర్ లోని రామ్ బిహారీ చౌబే ఇంటికి వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. దీంతో రామ్ బిహారీ అనుచరులు వారిని అతని వద్దకు తీసుకెళ్లారు. ఆయనకు అతి సమీపంలోకి వెళ్లిన వారు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, మాఫియా డాన్ బ్రజేష్ సింగ్ తో సన్నిహిత సంబంధాలు కలిగిన రామ్ బిహారీ 2017లో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఆయన బంధువులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.