: పాటలు పాడుతూ ఎంజాయ్ చేసిన బరాక్ ఒబామా!
ఇది క్రిస్మస్ సీజన్. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత వైభవంగా చేసుకునే పండగ. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం వాషింగ్టన్ లో నిర్వహించిన క్రిస్మస్ ప్రారంభ వేడుకల్లో భార్య మిషెల్ ఒబామా, కుమార్తెలు మాలియా, సాషాలతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ ట్రీని ఆవిష్కరించిన ఆయన, తన గొంతు విప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గాయకులతో కలసి పాటలు పాడి అలరించారు. అనంతరం ప్రసంగిస్తూ, కాలిఫోర్నియాలో జరిగిన ఉగ్రదాడిలో మృతులకు నివాళులు అర్పించారు.