: పడవలో వెళ్లి... చిన్నారులకు ఆహార పదార్థాలు పంపిణీ చేసిన ఇళయరాజా


చెన్నై వరద బాధితులకు ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తే, మరికొందరు ప్రత్యక్షంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే బాటలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొంతమంది సాయంతో పడవలో అక్కడి లిటిల్ ఫ్లవర్ అంధుల పాఠశాలకు వెళ్లారు. అక్కడున్న చిన్నారులకు తన చేతుల మీదుగా ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. కొద్దిసేపు వారితో గడిపి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్నంతటినీ రాజా సంగీతం అందించిన తెలుగు చిత్రం 'అబ్బాయితో అమ్మాయి' బృందం ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించింది. రవాణాకు వీలుకాని పరిస్థితుల్లో కూడా రాజా చిన్నారుల వద్దకు వెళ్లి ఆహారం అందించడం గొప్ప విషయమని పేర్కొంది. ఆ సందర్భంగా తీసిన ఫోటోలను పోస్టు చేసింది. సాయం చేయడానికి ఎంత డబ్బైనా ఇచ్చే స్థోమత ఆయనకుంది. కానీ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలనుకున్న ఇళయరాజా 72 ఏళ్ల వయసులో పరిస్థితులను లెక్కచేయకుండా వెళ్లడం పలువురుని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు.

  • Loading...

More Telugu News