: కర్నూలును స్మార్ట్ సిటీగా మారుస్తాం: డిప్యూటీ సీఎం కేఈ
కర్నూలును స్మార్ట్ సిటీగా మారుస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, టీడీపీ నేత టీజీ వెంకటేశ్ హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే జిల్లా అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. కర్నూలులో ఇవాళ నిర్వహిస్తున్న పార్టీ జన చైతన్య యాత్రలో కేఈ, టీజీ పాల్గొన్నారు. నగరంలోని పలు వార్డుల్లో పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ, కర్నూలు నగర పరిస్థితులపై అధ్యయనానికి ఈ నెల 9న ఆస్ట్రేలియా బృందం రానుందని తెలిపారు.