: శని సింగనాపూర్ ఆలయ ఆచారాలు సమర్థనీయమే: బీజేపీ మంత్రి పంకజా ముండే


మహారాష్ట్రలోని షిరిడీ సమీపంలోని శని సింగనాపూర్ ఆలయం ఆచారాలు సమర్థనీయమేనని... పూజ చేసేందుకు వచ్చిన మహిళను అడ్డుకోవడం సబబేనని ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి పంకజా ముండే అన్నారు. ఆలయ ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం అవి నడుస్తాయని, ఆ ఆలయంలో మహిళలు పూజలు చేయడం నిషేధమని అన్నారు. ప్రతిపక్షపార్టీ ఎన్సీపీ వీటన్నింటిని పట్టించుకోకుండా మహిళలను అవమానిస్తున్నారని అనడం సబబు కాదన్నారు. కాగా, శని సింగనాపూర్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లిన ఒక మహిళను అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సంఘటనపై ప్రతిపక్ష పార్టీ ఎన్సీపీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె పైవిధంగా వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి ముండే చేసిన ప్రకటనను ఎన్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు చైత్ర వాఘ్ ఖండించారు. పురుషులతో సమానంగా మహిళలను గౌరవించడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనమని, మంత్రి తాజా వ్యాఖ్యలు అందుకు మరింత బలాన్ని చేకూర్చాయని ఆమె ఆరోపించారు.

  • Loading...

More Telugu News