: టీఆర్ఎస్ లో 'ఆపరేషన్ ఆకర్ష్' అనే కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు: ఎంపీ గుత్తా వ్యంగ్యం


తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నేతల వలసలను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ పార్టీపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీలో 'ఆపరేషన్ ఆకర్ష్' అనే కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారని వ్యంగ్యంతో అన్నారు. ఆ శాఖ బాధ్యతలు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పధ్ధతి కాదని సూచించారు. వలసలు ప్రోత్సహిస్తూ ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు డిపాజిట్లు రాకుండా చేశామని చెబుతున్న టీఆర్ఎస్... ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తుందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష, వామపక్ష పార్టీలను కలుపుకుని పోతామని గుత్తా చెప్పారు.

  • Loading...

More Telugu News