: తాలిబన్ అగ్రనేత ముల్లా అక్తర్ మన్సూర్ హతం
తాలిబన్ సంస్థ అగ్రనేత ముల్లా అక్తర్ మన్సూర్ మృతి చెందాడు. అతను చనిపోయిన విషయాన్ని ఆప్ఘనిస్తాన్ అధికారులు ధ్రువీకరించారు. అయితే గ్రూపు తగాదాలే అతడిని మట్టుబెట్టాయని అంటున్నారు. తాలిబన్ ఉగ్రవాద సంస్థలోని కమాండర్ల మధ్య వివాదాలు తలెత్తడంతో రెండు గ్రూపులుగా చీలిపోయిందని సైన్యం తెలిపింది. ఈ క్రమంలో వారి మధ్య తలెత్తిన వాగ్వాదం, ఘర్షణతో కాల్పులు జరిగాయని, ఈ సమయంలో గాయపడిన మన్సూర్ ఇవాళ మరణించాడని ఆప్ఘన్ అధికారులు వెల్లడించారు. గత జులైలో ముల్లా ఒమర్ మరణంతో తాలిబన్ చీఫ్ గా మన్సూర్ నియమితులయ్యాడు.