: భారత్ కు సత్తా ఉంది... అయినా వెంట మేముంటాం: అమెరికా


ఎటువంటి విపత్తు ఎదురైనా తక్షణం స్పందించి సహాయక చర్యలు చేసేందుకు అన్ని విధాలుగా సత్తా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటని అమెరికా అధికారి మార్క్ టోనర్ వ్యాఖ్యానించారు. చెన్నైని ముంచెత్తిన వరదలను ప్రస్తావించిన ఆయన, అక్కడి పరిస్థితి అత్యంత దయనీయమని, ఆదుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. భారత ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలకు తమ పూర్తి సహకారం అందించి, వెన్నంటి నిలుస్తామని ఆయన వివరించారు. తమిళనాడులో వరద స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని అన్నారు. ఇండియా తమకు ప్రధాన భాగస్వామ్య దేశాల్లో ఒకటని, ఇండియాకు ఎటువంటి కష్టం కలిగినా తాము ఆదుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News