: ‘అండర్ వరల్డ్’ గుప్పిట్లోనే బాలీవుడ్!... ఇప్పటికీ చక్రం తిప్పుతున్న చోటా షకీల్


గతంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బాలీవుడ్ ను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడన్న విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ నిర్మాతలకు అప్పులివ్వడమే కాక ఆయా చిత్రాల లాభాల్లో భారీ వాటాలను దావూద్ లాగేసుకునే వాడని, ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ నటీమణులతో అతడికి దగ్గరి సంబంధాలు ఉన్నాయన్న పుకార్లు వినిపించాయి. ముంబై దాడుల తదనంతర పరిణామాల్లో తన మకాంను పూర్తిగా పాకిస్థాన్ కు మార్చేసిన దావూద్, బాలీవుడ్ ను వదిలేసి ఉంటాడని అంతా భావించారు. అయితే నిన్నటి సంచికలో ‘ద హిందూ’ పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికీ దావూద్ తన ప్రధాన అనుచరుడు చోటా షకీల్ తో బాలీవుడ్ పై పెత్తనం చెలాయిస్తూనే ఉన్నాడని ఆ కథనం పేర్కొంది. యూఏఈలో చోటా షకీల్ ఇప్పటికీ బాలీవుడ్ ఈవెంట్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది మే 27 నుంచి 30 మధ్య బాలీవుడ్ కు చెందిన ఓ టాప్ హీరోతో దుబాయ్ లో అతడు పెద్ద కార్యక్రమాన్నే నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి వచ్చే హీరోతో దావూద్ కొడుకు, కోడలు కలిసేలా అతడు ఏర్పాట్లు కూడా చేశాడట. దావూద్ కొడుకు, కోడలు బస కోసం దుబాయిలోని మేదాన్ హోటల్ లో ఓ డబుల్ రూంను కూడా బుక్ చేశాడు. ఇక పాకిస్థాన్ కు చెందిన ఓ నటుడు బాలీవుడ్ ఎంట్రీ కోసం చోటా షకీల్ ను సంప్రదించినట్లు ఆ కథనం పేర్కొంది.

  • Loading...

More Telugu News