: తమిళనాడుకు బీహార్ 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం
తమిళనాడు రాజధాని చెన్నైని ముంచెత్తిన వానలను చూసిన వివిధ రాష్ట్రాలు స్పందిస్తున్నాయి. చేయగలిగినదంతా చేస్తామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు హామీలివ్వగా; కర్ణాటక రాష్ట్రం 5 కోట్ల రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బీహార్ కూడా 5 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. వరద బాధితులను ఆదుకునేందుకు ఈ సాయం చేస్తున్నట్టు నితీష్ కుమార్ తెలిపారు. కాగా, చెన్నైలో ఇళ్లలో నీరు చేరడంతో అక్కడి ప్రజలు తాగు నీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రాంగం విఫలం కావడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.