: దారుణానికి పాల్పడ్డ కసాయి తండ్రి!


భార్యతో గొడవపడి తమ మూడేళ్ల కొడుకుని బావిలో పడేశాడు ఓ కసాయి తండ్రి. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడిన సంఘటన ఛత్తీస్ గఢ్ లోని జశ్ పూర్ జిల్లాలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి తుమ్లా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపిన వివరాలు.... బాబూసాజ్ పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి చైత్రమ్. అతని భార్య చంపాబాయి. వారి సంతానం సలీమా(10), శివరామ్(3). మద్యానికి బానిసైన చైత్రమ్ తరచుగా తన భార్యను వేధిస్తుండేవాడు. దీంతో విసిగిపోయిన చంపాబాయి తమ పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత చైత్రమ్ తన భార్యకు నచ్చజెప్పి రెండు రోజుల క్రితం తమ ఇంటికి తీసుకొచ్చాడు. నిన్నరాతి మద్యం తాగి ఇంటికి వచ్చిన చైత్రమ్ తన భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల కొడుకు శివరామ్ ని తీసుకెళ్లి తమ ఇంటి వద్ద ఉన్న బావిలో పడేశాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చంపాబాయి చెప్పడంతో బావిలో నుంచి చిన్నారిని బయటకు తీశారు. అప్పటికే, శివరామ్ చనిపోయాడు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News