: పైరవీలకు రాలేదు...చట్టం అమలు చేయమని కోరడానికే వచ్చాం!: జితేందర్ రెడ్డి


ఢిల్లీకి పైరవీలు చేసేందుకు రాలేదని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్ధీకరణ బిల్లులో పొందుపరిచిన అంశాలు అమలు చేయాలని కోరేందుకు తాము వచ్చామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీ చేరిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News