: 2013-15 సంవత్సరాల మధ్య 1500 ర్యాగింగ్ ఫిర్యాదులు వచ్చాయి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
ఇప్పటి వరకు తమకు అందిన 1500 ర్యాగింగ్ ఫిర్యాదులు గురించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ఓ ప్రశ్నకు కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్ లో నమోదైన తాజా గణాంకాల వివరాలను ఆమె వెల్లడించారు. యూజీసీ పరిధిలోని కళాశాలల్లో 2013లో 640, 2014లో 543, 2015లో 389 ఫిర్యాదులు నమోదైనట్టు స్మృతి ఇరానీ పేర్కొన్నారు.