: అది ఉగ్రదాడి కావచ్చు: అమెరికా అధికారులు


అమెరికాలో సంభవించిన దాడి ఉగ్రదాడి కావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలోని ఓ హాలిడే పార్టీ వద్ద సాయుధులైన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని మట్టుబెట్టారు. దుండగులను రిజ్వాన్ ఫరూఖ్ (28), తష్పీన్ మాలిక్ (26) గా గుర్తించారు. వీరిద్దరి మధ్య అనుబంధం ఉందని, వీరిద్దరూ వివాహం చేసుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు. కాల్పులు జరిపింది వీరేనని నమ్ముతున్నామని, వీరితో మరో వ్యక్తి కూడా ఉన్నాడన్న వార్తలు వెలువడ్డప్పటికీ నిర్ధారణ కాలేదని వారు పేర్కొన్నారు. ఈ కాల్పుల వెనుక కారణాలేంటన్నది తెలియనప్పటికీ, ఉగ్రదాడి కోణాన్ని కొట్టేయలేమని వారు అన్నారు. ఫరూఖ్ అమెరికాలో జన్మించి, ప్రజారోగ్యశాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడని, తమ సహోద్యోగులు నిర్వహించిన హాలీడే పార్టీ దగ్గరే వీరు బీభత్సానికి పాల్పడడం విశేషం.

  • Loading...

More Telugu News