: ఛోటా రాజన్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ జ్యుడీషియల్ కస్టడీని పెంచారు. అతనికి 15 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాజన్ సీబీఐ పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్లోజ్ డ్ డోర్ ప్రొసీడింగ్స్ జరిపారు. తరువాత కస్టడీ ఆదేశాలు జారీ చేశారని అధికారులు తెలిపారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఛోటా రాజన్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.