: ఇంద్రాణి ముఖర్జియాని విచారించేందుకు అవకాశం ఇవ్వండి: సీబీఐ అధికారులు


షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాను విచారించే అవకాశం ఇవ్వాల్సిందిగా సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె డ్రైవర్ శ్యామ్ రాయ్ లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వారికి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో వారిని మూడు వారాలపాటు ప్రశ్నించేందుకు అనుమతినివ్వాలంటూ సీబీఐ అధికారులు న్యాయస్థానానికి విన్నవించారు. ఈ కేసులో భాగంగా స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జియాను అధికారులు ఇప్పటికే విచారించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News