: టర్కీకి మరోసారి వార్నింగ్ ఇచ్చిన పుతిన్


రష్యా విమానం కూల్చేసిన టర్కీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. జాతీయ ప్రసంగంలో భాగంగా పుతిన్ మరోసారి టర్కీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రష్యా యుద్ధవిమానాన్ని కూల్చడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే టర్కీ నుంచి ఆహార దిగుమతులను నిషేధించిన ఆయన, టర్కీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ లో ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. తీవ్రవాదులను కూడా వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, సిరియా-టర్కీ సరిహద్దుల్లో ఎగురుతున్న రష్యా విమానాన్ని టర్కీ సైన్యం కూల్చేయగా, ఒక పైలట్ మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News