: విపరీతంగా తాగితే... మెడ 'గుర్రం మెడ'లా తయారైంది


చైనాలోని ఝువాంగ్ ఝు పట్టణానికి చెందిన హాంగ్ షు అనే వ్యక్తికి మద్యం అంటే చాలా ఇష్టం. అందుకే ఒక్క రోజు కూడా దానికి దూరం కాకుండా గత 30 ఏళ్ల నుంచి తాగాడు. పెగ్గో, క్వార్టరో కాదండోయ్... రోజుకు రెండు లీటర్ల మందు ఫుల్లుగా బిగించేవాడు. ఈ క్రమంలో, అతని మెడ, గొంతు ఊహించని విధంగా లావైపోయాయి. అతని మెడ ఏకంగా గుర్రం మెడ అంత అయింది. ఈ పరిస్థితుల్లో హాంగ్ షు కు ఊపిరి తీసుకోవడం, తిండి తినడం చాలా కష్టంగా మారింది. ఎంతో మానసిక వేదన అనుభవించిన అతను... చివరకు కుంగుబాటుకు లోనయ్యాడు. అసహ్యంగా మారిన తన ఆకారంతో బయటకు రాలేక, గదిలోనే ఉండి పోయేవాడు. చివరకు వైద్యులను సంప్రదించగా... అతను 'మేడ్ లంగ్' వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పారు. మూడు సర్జరీల ద్వారా అతని మెడ, గొంతు వద్ద ఉన్న కొవ్వును తొలగించవచ్చని తెలిపారు. మరోవైపు, ఈ వ్యాధి ఉన్న వారిలో 90 శాతం మంది అధికంగా మద్యం తాగుతారట. ఈ వ్యాధి ఎక్కువగా పురుషులకే వస్తుందట.

  • Loading...

More Telugu News