: చెన్నైలో మోదీని కలసిన సీఎం జయలలిత... మరో రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటన
తమిళనాడులో ఏరియల్ సర్వే చేసేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆ రాష్ట్ర సీఎం జయలలిత ఐఎన్ఎస్ అడయార్ లో కలుసుకున్నారు. వరద పరిస్థితులపై ప్రధాని జయను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి తక్షణ సాయం కింద మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్టు మోదీ ప్రకటించారు. కేంద్రం ఇప్పటివరకు ప్రకటించిన ఆర్థిక సాయానికి జయ ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు అరక్కోణంలోని నావికాదళం వైమానిక కేంద్రానికి చేరుకున్న మోదీ అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించారు. వరద నష్టాన్ని అధికారులు ప్రధానికి వివరించారు. చెన్నైని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.