: రక్షణ మంత్రితో భేటీ అయిన తెలంగాణ మంత్రులు


భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు. హైదరాబాదులో రక్షణ శాఖకు చెందిన పలు అంశాలపై వీరు చర్చించారు. మంత్రుల విన్నపాల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ నెలాఖరున లేదా జనవరిలో తాను హైదరాబాద్ వస్తానని చెప్పారు. కంటోన్మెంట్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సెక్రటేరియట్ నిర్మాణం కోసం టీఎస్ ప్రభుత్వం అడుగుతున్న బైసన్ పోలో భూమి అంశాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News