: రహానే అర్ధ శతకం...జడేజా అవుట్


సౌతాఫ్రికాతో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో అజింక్యా రహానే అర్ధ సెంచరీతో రాణించడంతో టీమిండియా 200 పరుగులు దాటింది. ఆటగాళ్లంతా పెవిలియన్ బాటపడుతున్నప్పటికీ మొక్కవోని దీక్షతో రహానే 91 బంతులాడి అర్థసెంచరీ సాధించాడు. ఇది అతని టెస్టు కెరీర్ లో 8వ అర్ధసెంచరీ కావడం విశేషం. అతనికి రవీంద్ర జడేజా (24) చక్కని సహకారమందించాడు. అబాట్ వేసిన బంతిని షార్ట్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడబోయిన జడేజా అక్కడ కాచుకుని ఉన్న ఎల్గర్ కు చిక్కాడు. దీంతో టీమిండియా ఏడవ వికెట్ కోల్పోయింది. దీంతో రహానే (72) కు అశ్విన్ (2) జత కలిశాడు. 75 ఓవర్లు ఆడిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో పిడిట్ 4 వికెట్లతో రాణించగా, అబోట్ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు.

  • Loading...

More Telugu News