: చెన్నైలో విషాదం... తల్లి శవం పక్కన 20 గంటలుగా జాగారం


వరద బీభత్సంతో అతలాకుతలమైన చెన్నైలో ఒక్కో విషాదం బయటపడుతోంది. తినటానికి తిండి, తాగటానికి నీరు సంగతి అటుంచితే... చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా వీలు కాని పరిస్థితి ఆవేదనను నింపుతోంది. అశోక్ నగర్ ప్రాంతంలో ఓ మహిళ తన తల్లి శవం పక్కన కూర్చొని 20 గంటలుగా జాగారం చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన తల్లి డయాలిసిస్ పేషంట్ అని... నిన్ననే ఆమె చనిపోయిందని... కరెంట్ కూడా లేకపోవడంతో ఆమె భౌతికకాయం చీకటిలోనే ఉందని తెలిపింది. అంతేకాదు అమె తల్లి భౌతికకాయం పాడైపోయే స్థితిలో ఉంది. ఎవరైనా తనకు సహాయం చేయాలని, శ్మశానానికి తరలించేందుకు వాహనం పంపించాలని ఆమె వేడుకుంటోంది. దీంతో, ఆమె స్నేహితుల ద్వారా ఈ విషయం మీడియాకు తెలిసింది. భారీ వరదతో శ్మశానాలు కూడా మునిగిన నేపథ్యంలో, అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టమే.

  • Loading...

More Telugu News