: చెన్నై వరదలపై లోక్ సభలో ప్రకటన చేసిన రాజ్ నాథ్ సింగ్
చెన్నైను ముంచెత్తిన భీకర వరదలపై లోక్ సభలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. వందేళ్ల తర్వాత చెన్నైలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయిందని చెప్పారు. ఈ వరదల వల్ల ఇప్పటి వరకు 269 మంది మృతి చెందారని వెల్లడించారు. వరదల కారణంగా చెన్నై ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లను మూసివేశారని చెప్పారు. చైన్నైలో 30, పుదుచ్చేరిలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిందని చెప్పారు. చెన్నైలో 40 శాతం కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నదని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని చెప్పారు.