: చెన్నై బయలుదేరిన ప్రధాని మోదీ


ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెన్నై బయలుదేరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించనున్నారు. తమిళనాడుకు పూర్తి సాయం అందిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మోదీ ఆ రాష్ట్ర పరిస్థితిని పరిశీలించి, ప్రజల ఇబ్బందులను తెలుసుకోనున్నారు. దాంతో తమిళనాడుకు చేయాల్సిన సాయంపై ప్రధాని ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తగా, చెన్నైలో రవాణా, సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News